మరోసారి మైకందుకున్న కొడాలి నాని… బాబుపై కురిపించిన నిప్పులవర్షం ఇది!

-

ఏపీలో చంద్రబాబు పేరుచెబితే అంతెత్తున లేచే వైకాపా నేతల్లో కొడాలి నాని ఒకరు. ఈ లిస్ట్ లో గతకొంతకాలంగా ఫస్ట్ ప్లేస్ ని కాపాడుకుంటూ వస్తున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల అన్న తేడాలు చూడని నాని… మనసుకు అనిపించిందీ అనిపించినట్లుగా అనేస్తారో లేక బాబుని చూడగానే “అన్న”గారికి జరిగిన అన్యాయం గుర్తొచ్చి అలా ఫైరవుతారో తెలియదు కానీ.. గుక్కతిప్పుకోకుండా విమర్శలు కురిపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి మైకందుకున్నారు ఏపీ మంత్రి కొడాలి నాని.

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలిపిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. చంద్రబాబుకి “దమ్ము ధైర్యం” ఉంటే 20మంది ఎమ్మెల్యేలతో రాజినామాలు చేయించి.. అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలని కోరుతూ ఎన్నికల్లోకి వెళ్లాలని.. ఆ 20 కి 20 గెలిచి వస్తే ఈ బిల్లులపై ఏపీ సర్కార్ పునరాలోచించే అవకాశం ఉంటుందని తెలిపారు! ఇంతకు మించిన స్పష్టమైన సవాల్ మరొకటి ఉండదనే కామెంట్లు వినిపిస్తోన్న నేపథ్యంలో… ఈ ఛాలెంజ్ అనంతరం మరింత దూకుడు పెంచారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న “పిచ్చి తుగ్లక్” నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు చిత్తు, చిత్తుగా ఓడించారని.. అయినా కూడా ఏమాత్రం “సిగ్గు లేకుండా” జూమ్ యాప్ ‌లో “పిచ్చివాగుడు” వాగుతున్నాడని అన్నారు. ఇదే క్రమంలో నేడు రాయలసీమకు జ్యుడీషియల్ క్యాపిటల్ వస్తుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారో చెప్పాలని… బాబు బుద్ది సీమ ప్రజలు ఎప్పుడో గ్రహించారు కాబట్టే… రాయలసీమ జిల్లాలో 52 సీట్లు ఉంటే బాబు, బాలయ్యలను మాత్రమే గెలిపించారని అన్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version