నిన్న చంద్రబాబు చేసిన కామెంట్లకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఓ 420.. జిత్తుల మారి నక్క అంటూ ఫైర్ అయ్యారు కొడాలి నాని.అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదని.. 1999లో చంద్రబాబు సీఎం గా వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెబితే అభ్యర్ధి ఓడి పోయారని ఎద్దేవా చేశారు.
దేవుడి దయవల్ల 2004, 2009లో నన్ను గెలిపించాలి అని చంద్రబాబు అనలేదు కాబట్టి నేను గెలిచానన్నారు. 2014లో అవినాష్ ను గెలిపించాలని కోరితే ఓడించారని పేర్కొన్నారు. చంద్ర బాబు జిత్తుల మారి నక్క.. చంద్ర బాబు గుడివాడ కు చేసింది ఏమీ లేదని విమర్శలు చేశారు కొడాలి నాని. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇపుడు దొంగ ప్రేమ ఒలక పోస్తున్నారు.. గుడివాడ నియోజక వర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లను కడుతూ అభివృద్ధి చేస్తున్నామన్నారు.