తెలంగాణ మంత్రులు హార్డ్‌గా…కొడాలి నాని సాఫ్ట్‌గా..తేడా ఏంటి?

-

ఏపీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)….అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్. ప్రతిపక్ష టీడీపీపై మొహమాట పడకుండా విరుచుకుపడే నాయకుడు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేస్తారో అందరికీ తెలిసిందే. అసలు బాబు గానీ, ఇతర టీడీపీ నేతలు గానీ వైసీపీపై, జగన్‌పైగానీ చిన్న విమర్శ చేసిన చాలు కొడాలి వెంటనే రియాక్ట్ అవుతారు.

అసలు పరుష పదజాలంతో బాబుపై విరుచుకుపడతారు. మీడియా సమావేశం పెట్టారంటే చాలు ఇంకా వైసీపీ కార్యకర్తలకు పండగే. ఎందుకంటే ఆయన ఆ రేంజ్‌లో చంద్రబాబుని తిడతారు. ఇటీవల నారా లోకేష్‌ని నాని ఎలా తిట్టారో అందరూ చూశారు. కానీ అలా టీడీపీపై విరుచుకుపడే నాని, వైఎస్సార్, జగన్‌లని దారుణంగా తిడుతున్న తెలంగాణ మంత్రులపై సాఫ్ట్‌గా విమర్శలు చేయడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు నాని ఇలా కూడా విమర్శలు చేస్తారా? అని షాక్ అవుతున్నారు. గత కొన్నిరోజులుగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో నీటిని వైఎస్సార్ దోచుకుంటే, ఇప్పుడు జగన్ దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. వైఎస్సార్, జగన్‌లు గజదొంగలని అంటున్నారు. అలాగే వైఎస్సార్ నరరూప రాక్షసుడుఅని ఫైర్ అవుతున్నారు. అయితే తెలంగాణ మంత్రులు ఈ రేంజ్‌లో ఫైర్ అవుతున్న కూడా ఏపీ మంత్రులు పెద్దగా స్పందించడం లేదు.

ఇక కొడాలి నాని ఈ విషయంలో చాలా సాఫ్ట్‌గా స్పందించారు. చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళ్ళే నాని, తెలంగాణ మంత్రులు ఆ రేంజ్‌లో మాట్లాడినా కూడా సాఫ్ట్‌గానే కౌంటర్లు ఇచ్చారు. వైఎస్సార్ రాక్షసుడు కాదని, రక్షకుడు అని, ఆయన బ్రతికి ఉంటే రాష్ట్రం ఇలా ఉండేదికాదని, రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడేవారని మాట్లాడారు. ఇక ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి వుంటాయని చాలా సాఫ్ట్‌గా మాట్లాడేశారు. ఇదే సమయంలో చంద్రబాబుపై మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. ఇలా తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నా కూడా ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సాఫ్ట్‌గా మాట్లాడటం వెనుక మర్మం ఏంటో ఆయనకే తెలియాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version