దారుణం : యువతిని బంధించి గ్యాంగ్‌ రేప్‌.. ఆ తరువాత..

-

చట్టం శిక్షిస్తుందన్న భయంగానీ.. పోలీసులకు పట్టుబడుతామనేది లేకుండా వికృత చేష్టలకు పాల్పడుతూ.. శునకానందం పొందుతున్నారు కామాంధులు.. రోజురోజుకు రెచ్చిపోతున్న కామాంధులను కట్టడి చేసేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. స్త్రీల జీవితాలు మాత్రం చీకట్లోకి వెళుతున్నాయి. యూపీ మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన ఓ 18 ఏళ్ల యువతిపై ఓ ముగ్గురు మృగాళ్ల కన్ను పడింది. దీంతో సదరు యువతిని ముగ్గురు కామాంధులు కిడ్నాప్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ యువతిని అంగట్లో సరుకులా విక్రయించారు. ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 21న బాధిత యువతి వివాహం జరగాల్సి ఉండగా.. 18న పెళ్లి వెడ్డింగ్‌ కార్డ్స్‌ పంచేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి.. కొన్ని రోజులపాటు ఆమెను తమతోనే ఉంచుకున్న యువకులు పలు మార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఓ రాజకీయ పార్టీ నేతకు విక్రయించారు. ఆయన కొన్ని రోజులపాటు సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం పక్కనే ఉన్న మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు ఆమెను పంపించాడు.

అయితే.. అక్కడి నుంచి ఎలాగోలా తన తండ్రికి ఫోన్ చేయడంతో.. బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను రక్షించి.. కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై విక్రయించారని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెహరౌలి సర్కిల్ ఆఫీసర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version