కొడాలి కమ్మని రాజకీయం..సడన్ చేంజ్..!

-

కొడాలి నాని అంటే ఫైర్ బ్రాండ్ నేత అందులో ఎలాంటి డౌట్ లేదు..ముఖ్యంగా చంద్రబాబుని బూతులు తిట్టడానికే కొడాలి నాని రాజకీయాల్లో ఉన్నారా? అనే విధంగా ఉంటుంది. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి ఏ స్థాయిలో చంద్రబాబు, లోకేష్‌ని బూతులు తిట్టారో చెప్పాల్సిన పని లేదు. అసలు మీడియా ముందుకొస్తే చాలు..ఇక బాబుపై విరుచుకుపడటమే అన్నట్లు ఉండేది.

ఆఖరికి బాబు ఫ్యామిలీని టార్గెట్ చేయడం..లోకేష్ పుట్టుక అంటూ భువనేశ్వరిపై దారుణంగా మాట్లాడటం లాంటివి చేశారు. అలా బాబుకు బూతులతో సమాధానం చెప్పే కొడాలిలో ఈ మధ్య మార్పు కనిపిస్తోంది. కరెక్ట్ గా లోకేష్ ఎలా పుట్టాడో ఏంటో అంటూ ఆ మధ్య కొడాలి మీడియా ముందుకొచ్చి దారుణంగా మాట్లాడారు. ఇంకా అప్పుడు మాట్లాడటమే మళ్ళీ తాజాగా దసరా రోజు వరకు నాని మీడియా ముందుకు రాలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి…వైఎస్సార్ అని పెట్టిన స్పందించలేదు.

అలాగే అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడలో జరిగిన స్పందించదలేదు. కానీ తాజాగా దసరా రోజు గుడివాడ నియోజకవర్గంలోని కొండాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కొడాలి మీడియాతో మాట్లాడారు. కానీ చంద్రబాబుని తిట్టలేదు..దూషించలేదు. కేవలం మూడు రాజధానుల కోసం అమ్మవారిని ప్రార్థించనని చెప్పారు. హైద‌రాబాద్‌ను కోల్పోయి తామంతా అనాథలమయ్యామని.. శ్రమంతా కేవలం అమరావతిపైనే పెడితే, మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకే జగన్ ఎంతో ఆలోచించి, మూడు రాజధానులు నిర్మించాలని డిసైడ్ అయ్యారని చెప్పారు. ఇక అమరావతి ఉద్యమాన్ని ప్రజలతో పాటు దేవుళ్లు కూడా హర్షించరని మాట్లాడారు.

అసలు పూర్తిగా సాఫ్ట్ గా మాట్లాడారు. అయితే సడన్ గా కొడాలిలో ఈ మార్పు ఏంటి అనేది ఎవరికి అర్ధం కాకుండా ఉంది. కొన్నిరోజులు ఇలాగే ఉంటారా? లేక మళ్ళీ యథావిధిగా బాబుని బూతులు తిడతారా? అనేది అర్ధం కావడం లేదు. అయితే ఎన్టీఆర్ పేరు మార్పు వాళ్ళే కొడాలి సైలెంట్ గా ఉన్నారని, గుడివాడలో కమ్మ ఓట్లు, ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు పోగొకూడదని ఇలా సైలెంట్ గా ఉంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి కొడాలి ఒరిజినల్ వర్షన్ ఎప్పుడు బయటకొస్తుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version