నారా లోకేష్ పాదయాత్రపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

-

నేడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర అని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే నారా లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చేస్తున్న పాదయాత్ర.. టిడిపికి పాడేయాత్ర అని విమర్శించారు.

లోకేష్ ఒక అసమర్ధుడని, ఆయనకి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంత కెపాసిటీ లేదన్నారు. టిడిపిలో వారసత్వం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ వారసుల నుంచి టిడిపిని లాక్కునేందుకే పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం చందాలు ఇచ్చిన వారి కోసం తప్ప లోకేష్ యాత్ర దేనికి పనికిరాదని స్పష్టం చేశారు. చంద్రబాబు 420 అయితే.. లోకేష్ 210 అని ఎద్దేవా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version