ఎవ్వరూ చెయ్యని తప్పు చేశాను.. సీనియర్ నటి కామెంట్స్..

-

అలనాటి తార షావుకారు జానకి గురించి అందరికి తెలుసు..తెలుగుతో పాటు ఇతర భాషల్లో షావుకారు జానకి 370కు పైగా సినిమాలలో నటించి ఆ సినిమాలతో సక్సెస్ లను అందుకున్నారు.ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.ఈమె 200 లపైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. షావుకారు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.అదే ఆమె పేరుగా మారింది.ఈమె కేవలం సినిమాలను మాత్రమే రంగస్థల నాటకాలు కూడా చేసింది.

 

 

కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవదాసు సినిమాలో ఛాన్స్ వచ్చి పది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత తీసేశారని ఆమె తెలిపారు. నాకు ఎలాంటి రోల్స్ నప్పుతాయో అవే ఇచ్చేవారని ఆమె తెలిపారు.. నేను ఎటువంటి క్యారెక్టర్ కావాలని అనుకుంటే అది ఇచ్చేవారనికి తెలిపింది.. పెళ్ళైయ్యాక పుట్టింటికి వెళితే వాళ్ళు చూసే తీరు కొత్తగా ఉంటుంది.. పెళ్లి చేసుకున్నాక అన్నీ అక్కడే అని ఉండాలి.. నేను ఆరోగ్యం బాగోలేక వెళ్ళాను..ఏ ఆడది చెయ్యని తప్పు చేసానని చెప్పారు..మన పేరెంట్స్ మనల్ని బాగా ఇష్టపడితే వెళ్లొచ్చు.. ఎందుకు మళ్ళీ భారం అనుకుంటే వెళ్లడం కష్టమే..

ఒకసారి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అత్తారింటికి పరిమితం కావాలని ఆమె అన్నారు. మనం ఎవరూ కూడా గుర్తించలేని పరిస్థితులు కూడా రావచ్చని షావుకారు జానకి అన్నారు. నాకు ఇండివిడ్యువాలిటీ ఎక్కువని కామెంట్లు వినిపించేవని ఆమె కామెంట్లు చేశారు. నాకు అవకాశాలు చాలా అరుదుగా వచ్చేవని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. షావుకారు జానకి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version