నిన్న కొడాలి నాని అలానే పేర్ని నాని లను ఉద్దేశించి పవన్ తీవ్ర విమర్శలు చేసిన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు మంత్రి కొడాలి నాని. పేర్ని నాని ను, తనను బోడి లింగాలు అన్నా పవన్ కళ్యాణ్ పెద్ద బోడి లింగం అంటూ నాని ఫైర్ అయ్యారు. తామిద్దరం శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేసారని కొడాలి నాని అన్నారు. ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చ కామెర్లు సోకిన యాక్టర్ లను ప్రజలు నమ్మరని నాని అన్నారు. జల తిరస్కారానికి గురైన పవన్ కళ్యాణ్ సిగ్గు శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టమని ఆయన అన్నారు.