బాబుకి షాకింగ్ న్యూస్.. బీజేపీ గూటికి కోడెల..?

-

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ గాలిలో కొట్టుకోపోయిన టీడీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారిపోయింది. చంద్రబాబుని నమ్ముకుంటే గట్టెక్కలేమని ముందుగానే ఊహించిన సుజనా, సీఎం రమేష్ లాంటి కీలక నేతలు సైతం బాబు ని వీడి వెళ్ళిపోయారు. ఎందుకంటే జగన్ తమ ఆర్ధిక మూలాలు ఎక్కడ దెబ్బ కొడతాడో అనే ముందు చూపు వారిని బీజేపీలో చేరేలా చేసింది. పైగా తమ వ్యాపార సామ్రాజ్యం చెక్కు చెదరకుండా ఉండాలంటే బీజేపీ అభయ హస్తం తప్పనిసరి. అంతేకాదు

Kodela Siva Prasada Rao Likely to join the BJP

బీజేపీలో ఉంటే జగన్ తమపై ఎలాంటి చర్యలు చేపట్టడానికైనా సరే వెనుకాడుతాడనే ఆలోచన కూడా బీజేపీ వైపు అడుగులు వేయించింది. అంతేకాదు ఇప్పుడు చాలామంది సీనియర్ నేతలు టీడీపీ నుంచీ బీజేపీ లోకి దూకేయడానికి సిద్దంగా ఉన్నారట. ఈ జంపింగ్ లిస్టు లలో మొట్టమొదటి పేరు తాజాగా వైసీపీ హిట్ లిస్టు కొట్టు మిట్టాడుతున్న మాజీ స్పీకర్ కోడెల పేరు బలంగా వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన అవినీతి, అక్రమాలపై బెల్టు తీస్తున్న ఏపీ ప్రభుత్వం మరింత లోతుగా కోడెల వ్యావహరంపై దృష్టి పెట్టిందట దాంతో..

కోడెల రాజకీయ భవిష్యత్తు మళ్ళీ పుంజుకోవాలన్నా, ఈ కేసుల చిక్కుల నుంచీ బయట పడాలన్నా బీజేపీ అండదండలు తప్పనిసరి కావడంతో ఇప్పటికే టీడీపీ నుంచీ బీజేపీలోకి వెళ్ళిన సన్నిహితులతో కోడెల మంతనాలు జరిపారట. దాంతో సదరు నేత బీజేపీ పెద్ద అధిష్టానం వద్ద కోడెల విన్నపాన్ని ఉంచారని, సదరు బీజేపీ నేత కూడా కోడెల వస్తే భవిష్యత్తులో నరసరావు పేట, సత్తెనపల్లి ప్రాంతాలలో కొద్దో గొప్పో పట్టు సాధించవచ్చని భావిస్తున్నరాట. అంతేకాదు

కోడెల వంటి సీనియర్ నేత అందులోనే ఇప్పటికే వైసీపీ వలన పరువు పోగొట్టుకుని పీకల లోతు కోపంగా ఉన్న కోడెలని అక్కున చేర్చుకుంటే భవిష్యత్తులో వైసీపీని కోడెలతో టార్గెట్ చేయచ్చు అనే ఆలోచనలో ఉన్నారట. అయితే బీజేపీ అధిష్టానం ఒకే చెప్తే త్వరలోనే కోడెల కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాలలో హల్చల్ చేస్తోంది.మరి కోడెల ప్రస్తుతానికి కేసుల నుంచీ తప్పించుకోవడానికైనా సరే బీజేపీలోకి చేరుతారా లేక గాలివార్తలుగా కొట్టి పారేస్తారా అనేది వేచి చూడాల్సిందే

Read more RELATED
Recommended to you

Exit mobile version