GHANI : “గని” నుంచి ఐటెం సాంగ్ రిలీజ్..దుమ్ములేపిన తమన్నా

-

మెగా హీరో వరుణ్‌ తేజ్‌.. వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గద్దల కొండ గణేష్‌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్‌ తేజ్.. ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమాలో ”కొడితే” అంటూ సాగే ఐటెం సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. సంక్రాంతి సందర్భంగా ఈ అప్డేట్‌ ను విదిలింది చిత్ర బృందం. ఇక కొడితే సాంగ్‌లో టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ… తమన్నా నటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పాటకు తగ్గట్టుగానే… చిందులు వేస్తూ… రచ్చ లేపింది తమన్నా. మొత్తానికి ఈ సాంగ్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news