కేసీఆర్ కీలక నిర్ణయం..”కోఠి ఉమెన్స్ కాలేజీ” పేరు మార్పు !

శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్‌ కాలేజ్‌ కు మహిళా విశ్వ విద్యాలయం హోదా దక్కనుంది. గతంలోనూ ఇందులో సంబంధించి కేసీఆర్‌ సర్కార్‌ ప్రయత్నాలు చేయగా… కార్య రూపం దాల్చలేదు. కానీ.. ఈ విడత సీఎం కేసీఆర్‌ తనయుడు, మంత్రి కేటీఆర్‌ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్‌ కాలేజీ యూనివర్సిటీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కేటీ ఆర్‌ తాజాగా కోఠి మహిళా యూనివర్సిటీ ప్రతిపాదనను చర్చకు తీసుకు వచ్చారు. నిజాం పాలనలో 1924 లో ఏర్పాటు అయిన కోఠి మహిళా కళాశాల 2024 లో శతాబ్ది ఉత్సవాలకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ నుంచి ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. ఇక త్వరలోనే దీనిపై ప్రతిపాదనలను రూపొందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన త్వరలోనే కోఠి ఉమెన్స్‌ కాలేజ్‌ పేరు త్వర లోనే మార్పు జరుగనున్నట్లు తెలుస్తుంది.