ఆసియా కప్-2022లో భాగంగా బుధవారం జరిగిన టీమ్ఇండియా-హాంకాంగ్ మ్యాచ్ లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ వరల్డ్ రికార్డును సమం చేశాడు.
ఈ మ్యాచ్ లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ కెరీర్లో 31 వ హాఫ్ సెంచరీ సాధించి, రోహిత్ పేరిట ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును సమం చేశాడు. రోహిత్ 134 మ్యాచ్ లో 31 ఆఫ్ సెంచరీలు సాధించగా, కోహ్లీ 101 మ్యాచ్లోనే 31 ఆఫ్ సెంచరీల మార్కును చేరుకున్నాడు. కాగా కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్… సూర్యకుమార్ మాస్ ఇన్నింగ్స్ తో చెలరేగడంతో టీమిండియా.. ఈ మ్యాచ్ లో 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.