కోహ్లి ఆ డైపర్ పిల్లాడ్ని టీంలోకి తీసుకో… అతను ఎవరూ అంటూ కోహ్లి రిప్లయ్…!

-

గత నెల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది… డైపర్ కట్టుకుని ఉన్న ఒక పిల్లాడు… క్రికెట్ ఆడుతూ కనిపిస్తాడు… ఆ వీడియోలో అతను ఆడిన షాట్లు చూసి క్రికెట్ ప్రపంచం కాసేపు ఆగిపోతుంది… ఏ షాట్ అయినా సరే ఆ పిల్లాడు అవలీలగా ఆడటం చూసిన నెటిజన్లు టీం ఇండియా బ్యాటింగ్ దిగ్గజం డైపర్ వేసుకున్నాడు అంటూ వ్యాఖ్యలు కూడా చేసాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విస్తృతంగా వైరల్ అయి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఇప్పుడు అదే వీడియోని మాజీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్‌సన్ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసాడు. కెవిన్ పీటర్సన్ విరాట్ కోహ్లీని తన జట్టులో చేర్చమని కోరాడు. “ఏమిటి?!?!?!?!?! అతన్ని మీ జట్టులో చేర్చుకోండి, విరాట్ కోహ్లి… మీరు అతన్ని జట్టులోకి తీసుకుంటారా అంటూ కేపి వ్యాఖ్యానించాడు… దీనిని చూసిన కోహ్లి వెంటనే రిప్లయ్ ఇచ్చాడు… “అతను ఎక్కడ నుండి వచ్చాడు? అతను అవాస్తవం” అంటూ కామెంట్ చేసాడు. దీనిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ కూడా దీనిపై స్పందించారు.

మరో మార్గం లేదు అదో క్రేజీ అంటూ… దుప్లేసిస్ వ్యాఖ్యానించగా… “తీవ్రమైన ప్రతిభ మరియు ఇంకా నాపీలు కూడా లేవు” అని జాక్వెస్ కాలిస్ పీటర్సన్ పోస్ట్‌పై వ్యాఖ్యానించాడు. “ఖచ్చితంగా అతనికి ఇంగ్లీష్ పిల్లి లేదా కుక్క ఉంది …” అని వీడియో ఆ వీడియోని వాన్ పోస్ట్ చేసాడు. ఇక అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను క్రికెట్ సంచలనం కాబోతున్నాడని… డైపర్ వేసుకున్న క్రికెట్ లెజెండ్ అంటూ ఆ పిల్లాడి ఆటకు ఫిదా అయిపోయారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version