ఓ వ్యక్తి కాలినడకన కోల్‌కతా నుంచి 2500 కిలోమీటర్ల దూరంలోని లడఖ్‌కు చేరుకోని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. టీ విక్రయించి పొట్టపోసుకునే మిలన్ మాఝీ కేవలం 82 రోజుల్లోనే ఈ సాహస యాత్రను పూర్తిచేశాడు. లడఖ్‌కు బైక్‌పై వెళ్లాలనేది మిలన్ మాఝీ కల కాగా, బైక్‌ను కొనడం తన కుటుంబానికి తలకు మించిన భారం కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. బైక్ లేకపోవడం తన ప్రయాణానికి ఎంతమాత్రం ఆటంకం కాదని ఫిబ్రవరి 22న హౌరా బ్రిడ్జి నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన మిలన్ మే 15న లడఖ్‌లోని ఖర్ధుంగ్లా పాస్‌లో అడుగుపెట్టాడు.
కాలినడకన మిలన్ రోజుకు ఏకంగా 30 కిలోమీటర్లు ప్రయాణించాడు. వంద రోజుల్లో తన ప్రయాణాన్ని ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్న మిలన్ 82 రోజుల్లోనే యాత్రను విజయవంతంగా ముగించాడు. గమ్యస్ధానానికి చేరుకునేలా మిలన్‌కు పలు స్వచ్ఛంద సంస్ధలు, సేవా సంస్ధలు సహకరించాయి. మిలన్ యాత్ర గురించి తెలుసుకున్న పలువురు అతడికి అవసరమైన వసతి, భోజన ఏర్పాట్లు సమకూర్చారు. తన కుమారుడు లడఖ్ కాలినడకన వెళతాడని తనకు తెలియదని మిలన్ తండ్రి అనిల్ మాఝీ చెప్పుకొచ్చారు.