కోల్‌కతా అత్యాచారం, హత్యకేసుతో యావత్ భారతం ఒక్కసారిగా భగ్గున మండిన విషయం తెలిసిందే. ఆర్జీకర్ ఆస్పత్రిలో మెడికో స్టూడెంట్‌ను ఆస్పత్రిలోనే రేప్ చేసి హతమార్చిన ఘటనలో సంజయ్ రాయ్ అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఈ కేసుపై విచారించిన బెంగాల్లోని సీల్దా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
సంజయ్ రాయ్‌ను ఈ కేసులో దోషిగా తేల్చుతూ సీల్దా కోర్టు తీప్పునిచ్చింది. సోమవారం నాడు నిందితుడికి వేయబోయే శిక్ష గురించి తీర్పువెలువడనుంది. కాగా, 2024 ఆగస్టు 7న ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటన గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను మరోసారి గుర్తుచేసింది. మృతురాలికి దేశవ్యాప్తంగా ఉన్న మెడికోలు సంఘీభావం తెలిపారు. ఇదిలాఉండగా కోర్టు తీర్పుపై బాధితురాలి తండ్రి అభ్యంతరం తెలిపారు. తన కూతురి హత్య కేసులో ఒక్కరినే ఇరికిస్తున్నారని.. ఇంకా ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు మొత్తం ఐదుగురి ప్రమేయం మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.