కేంద్ర మంత్రిని కలిసిన కోమటి రెడ్డి.. కారణమిదే

-

ఢిల్లీ: భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాని కలిశారు. కొత్తగా ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మన్సుఖ్ మాండవియాకు శుభాకాంక్షలు తెలియజేశారు కోమటిరెడ్డి. అనంతరం భువనగిరి నియోజకవర్గం అభివృద్ధిపై కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. బీబీ నగర్‌ అఖిల భారత విజ్ఞాన సంస్థ లోని.. మూడవ బ్యాచ్‌ లో ప్రవేశం చేసే విద్యార్ధులకు అవసరమగు ఇంఫ్రాస్ట్రక్చర్ (భవనములు) మరియు ఇతర వనరులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోమటిరెడ్డి కోరారు.

అయితే.. కోమటిరెడ్డి అభ్యర్థనపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఆయనతో భేటీ తర్వాత… ఆ మంత్రిత్వ శాఖకు చెందిన సెక్రటరీని కూడా కోమటి రెడ్డి కలిశారు. ఎయిమ్స్‌కు మొదట అడిగిన ప్రొపోజల్‌కు 20 శాతము ఎక్కువ బిల్డింగు అవసరమని అభ్యర్థించారు కోమటిరెడ్డి. అయితే..దానికి కావలసిన ఆమోదాన్ని వెంటనే ఇవ్వాలని ఆదేశించారు సెక్రటరీ. అలాగే వారము రోజులలో భవన సముదాయ నిర్మాణమునకు టెండర్లు పిలవాలని అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version