కాంగ్రెస్ పార్టీపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. సిడబ్ల్యుసి లో తనకు అవకాశం వస్తుందని అనుకుంటున్నాట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పీసీసీ విషయంలో అన్యాయం జరిగిందని…. ఈసారి న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని ఆయన వెల్లడించారు.
సిడబ్ల్యుసి ఎంపిక తర్వాత…. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని వివరించారు. సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని కార్గే చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాగా, అటు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు.