BIG BREAKING : రాజకీయాలకు సోనియా గాంధీ గుడ్​బై

-

కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు.

పార్టీ ప్లీనరీ సమావేశంలో 1500మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన సోనియా.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగియడం చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు సోనియా గాంధీ తెలిపారు. ఈ యాత్ర కాంగ్రెస్‌ పార్టీకి టర్నింగ్‌ పాయింట్‌ అయిందని అన్నారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని.. భారత్‌ జోడో యాత్రగా రుజువైనట్లు సోనియా వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సోనియా పిలుపునిచ్చారు.

“మనమంతా క్రమశిక్షణలో పనిచేద్దాం. గతంలో ఎన్నో ఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదాం. పార్టీ గెలుపు అంటే దేశానికి విజయం కాకుండా మనలో ప్రతి ఒక్కరిది అని గుర్తుంచుకుందాం.”

-సోనియాగాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి

Read more RELATED
Recommended to you

Exit mobile version