తెలంగాణలో హాంగ్…కోమటిరెడ్డి జోస్యం నిజమేనా?

-

ఇంతవరకు తెలంగాణ రాజకీయాల్లో ఎవరికి వారు గెలుపు తమదంటే తమదనే ధీమాలో ఉన్నారు. ఎక్కడ కూడా హాంగ్ అసెంబ్లీ గురించి చర్చ జరగలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్..మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. 90 పైనే సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అటు బి‌జే‌పి నేతలు కూడా అంతే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తొలిసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని అంటున్నారు.

ఇటు కాంగ్రెస్ సైతం ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని అంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయి ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. తమకు 72 సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తుంది. ఇలా ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. కానీ అంతర్గతంగా ప్రజా నాడీ పట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం కనిపిస్తుంది.

అదే సమయంలో కాంగ్రెస్ సెకండ్, బి‌జే‌పి థర్డ్ ప్లేస్ లో ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతుంటే..బి‌జే‌పి సెకండ్, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ హాంగ్ గురించి ఎక్కడా చర్చ లేదు. కానీ ఇపుడు కోమటిరెడ్డి చర్చ లేపారు. కోమటిరెడ్డి జోస్యం నిజమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి-కాంగ్రెస్ మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

అదే సమయంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి పెద్ద లీడ్ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు దాటితే ఇబ్బంది లేదు..కానీ బి‌జే‌పి-కాంగ్రెస్ పార్టీలు సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే హాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ సారి తెలంగాణలో ఎలాంటి ఫలితం వస్తుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version