Breaking : రామభక్తులకు శుభవార్త.. డిసెంబర్‌ నుంచి ఆయోధ్య రాముడి దర్శనం

-

అయోధ్యలోని రామ జన్మభూమిపై కొన్ని సంవత్సరాల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో రామ జన్మభూమిపై విభిన్న వాదనలకు ఫులస్టాప్‌ పడింది. అయితే.. ఈ నేపథ్యంలో అయోధ్యలోని రామ జన్మభూమిలో రామాలయం పనులు శర వేగంగా సాగుతున్నాయని.. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి భక్తుల దర్శనాల కోసం సిద్ధమవుతుందని అయోధ్య ట్రస్టు తెలిపింది. ఆలయ నిర్మాణం అద్భుతంగా కొనసాగుతోందని.. ఎక్కడా ఇనుము వాడకుండా రాతితో నిర్మిస్తున్నామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

అయోధ్య సమీపంలోని సుల్తాన్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘సుల్తాన్ పూర్ అయోధ్యకు సమీపంలోనే ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ లో శ్రీరాముడి దర్శనానికి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అయోధ్య రామాలయం నిర్మాణం శర వేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటి కల్లా దర్శనాలకు సిద్ధమవుతుంది..” అని చంపత్ రాయ్ పేర్కొన్నారు. అద్భుతమైన శైలిలో రామాలయ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version