రాజగోపాల్‌ రెడ్డి.. తెలంగాణ ద్రోహివి.. అంటూ మునుగోడులో పోస్టర్లు..

-

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికే కాకుండా, ఎమ్మెల్యే పదవికి సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో… ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక రాబోతోంది. దీంతో, మునుగోడులో విజయం సాధించడం కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా మైలేజీ ఉంటుంది కాబట్టి… ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మరోవైపు భువనగిరి జిల్లా నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి  వ్యతిరేకంగా వెలిసిన పొస్టర్లు కలకలం రేపుతున్నాయి.

తెలంగాణ ద్రోహివి… రూ. 22 వేల కాంట్రాక్ట్ కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి… సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరమాడిన నీచుడివి… మునుగోడు నిన్ను క్షమించదు అంటూ పోస్టర్లపై పేర్కొన్నారు. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియని సమయంలోనే ఈ స్థాయిలో రాజకీయ వేడి ఉంటే… రాబోయే రోజుల్లో ఇది
మరెంత రగులుతుందో వేచి చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version