ఎడిట్ నోట్: సర్వే..టీడీపీ-జనసేన కలిస్తే?

-

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హడావిడి ఎక్కువైపోయింది…ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి…దీంతో సర్వే సంస్థలు కూడా ఎప్పటికప్పుడు రెండు రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ…పార్టీల బలబలాల గురించి నివేదికలు ఇస్తున్నాయి. ఇప్పటికే కొన్ని లోకల్ సర్వేలు…వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ సర్వేలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఇండియా టీవీ సర్వే బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో కేంద్రంలో ఎన్డీయే, తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ మళ్ళీ అధికారం దక్కించుకోవచ్చని వెల్లడించింది.

తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..కేంద్రంలో ఎన్డీయే 286 సీట్లు గెలుచుకుని మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ 8, బీజేపీ 6, కాంగ్రెస్ 2, ఎం‌ఐ‌ఎం ఒక ఎంపీ సీటు గెలుచుకుంటుందని వెల్లడించింది. అయితే ఏపీ విషయానికొస్తే…వైసీపీకి 18, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది.

అలాగే 127 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి కాస్త పాజిటివ్ ఉందని చెప్పింది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే సర్వేకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే…గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ బలం తగ్గుతుంది…గతంలో 22 ఎంపీ సీట్లు గెలుచుకోగా, ఇప్పుడు 18…అటు టీడీపీ బలం పెరుగుతుందని తెలుస్తోంది.

అయితే బలం తగ్గిన వైసీపీదే అధికారం. కాకపోతే ఇక్కడ విశ్లేషకులు కొత్త చర్చ లేపుతున్నారు..అంటే వైసీపీ బలం నిదానంగా తగ్గుతూ వస్తున్నది…ఎన్నికల నాటికి ఇంకా తగ్గితే ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు. అదే సమయంలో సర్వే అనేది వైసీపీ-టీడీపీజనసేన పార్టీల వారీగా చేసింది. ఇందులో జనసేనకు ఒక్క సీటు కూడా దక్కడం లేదు. కానీ టీడీపీ-జనసేన కలిస్తే ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై సర్వే జరగలేదు.

ఇప్పటికే ఆ రెండు పార్టీలు పొత్తు ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది…ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిస్తే…ఫలితాలు మారిపోయే ఛాన్స్ కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా మామూలు సర్వేలో వైసీపీ బలం కాస్త తగ్గుతూ వస్తుందని తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఇంకా తగ్గి, టీడీపీ-జనసేన పొత్తు ఉంటే పరిస్తితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ఇంకా మెరుగ్గా పనిచేస్తే…వారి బలం ఇంకా పెరగవచ్చు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. మరి చూడాలి ఈ సారి ఏపీలో ఫలితం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version