కోమటిరెడ్డి, సంపత్ లకు హైకోర్టు షాక్

-

 

సింగిల్ బెంచ్ తీర్పుపై రెండు నెలలు స్టే..

కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లకు హైకోర్టుల డివిజన్ బెంచ్ షాకిచ్చింది. వారిద్దరి శాసనసభ సభ్యత్వాన్ని పురరుద్దరిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది దీంతో డివిజన్ బెంచ్ రెండు తీర్పుపై రెండు నెలల స్టే విధించింది.

తెలంగాణ అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేయడం ..ఆతర్వాత ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన సింగిల్ బెంచ్ వారిద్దరి సభ్యత్వాలను పునరుద్ధరించి, గన్ మెన్లను కేటాయించాలని తీర్పు ప్రకటించిన సంగతి తెలిసిందే… సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని  అసెంబ్లీ కార్యదర్శి,  న్యాయశాఖ కార్యదర్శి అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ లు మళ్లీ కోర్టుని ఆశ్రయించారు. దీంతో కోర్టు వారికీ నోటీసులు జారీచేసింది… గన్ మెన్ల కేటాయించడంలోనూ అలసత్వంపై డీజీపీ, గద్వాల్, నల్గొండ జిల్లా ఎస్పీలకు సైతం నోటీసులు పంపారు. ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై.. ప్రభుత్వం డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది..ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ … ప్రస్తుత పరిస్థితుల్లో  గత ఉత్తర్వులను నిలిపివేస్తూ.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శి, ఇతర అధికారులపై ఇచ్చిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై స్టే విధిస్తూ ఉత్వర్వూలు జారీచేయాలని అభ్యర్థించారు. రోహత్గీ వివరించిన విషయాలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధా కృష్ణ‌  నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news