రేవంత్ రెడ్డి నోరు జారితే నష్టనివారణ చేశా : ఎంపీ కోమటిరెడ్డి

-

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అర డజన్ కు చేరగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేరుతారనే సంకేతాలు వస్తూన్న నేపథ్యంలో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉచిత విద్యుత్‌పై పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు జారితే తాను లాగ్ బుక్‌ను బయటపెట్టి నష్టనివారణ చేశానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారవుతారన్నారు. బీఆర్ఎస్ హయాంలో చాలామందికి రైతుబంధు అందలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదిన్నర గంటలు మాత్రమే కరెంట్ ఇస్తోందని ఆరోపించారు. ఈసారి కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని స్థానాలకు అభ్యర్థులు ఉన్నారని, కొత్తగా ఎవరూ చేరాల్సిన అవసరం లేదని గతంలోనే కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version