ప్రధాని మోడీ చంద్రయాన్ 3 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించేందుకు బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ ప్రకారం ప్రధానిని ఆహ్వానించేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు వెళ్లాల్సి ఉంది. కానీ వారు వెళ్లలేదు. దీంతో ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత తమను ఎయిర్ పోర్టుకు రావొద్దన్నారని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు.
తాను.. ప్రధాని నరేంద్ర మోదీకి బెంగళూరు విమానాశ్రయంలో స్వాగతం పలకలేదని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. ప్రధానికి సాదరస్వాగతం పలికేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ పీఎంవో సమాచారంతో దూరంగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయాలు చేసే గడువు అయిపోయిందని (ఎన్నికలను ఉద్ధేశించి), ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి పెట్టవలసిన సమయమని శివకుమార్ అన్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు కర్ణాటక నెలవు అనీ, ప్రధాని ఏ సమయంలో వచ్చినా మాలో (ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి) ఏవరో ఒకరం ఆయనను రిసీవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామనీ, కానీ పీఎంవో నుండి సమాచారం ఉన్నందున వెళ్లలేదన్నారు.