ఒక ఘటన… కేసీఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎఫెక్ట్!

-

సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది.. స్పందించాల్సిన పోలీసు వ్యవస్థ ఆలస్యం చేసింది.. ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు వాళ్ల వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు.. మరోవైపు పోలీసులు రివార్డ్లు ప్రకటిస్తున్నారు.. అధికారులు ఆఫర్లు ఇస్తున్నారు! సింగరేణి కాలనీలో జరిగిన గిరిజన బాలిక దారుణంపై సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటుంది.. సోషల్ మీడియా మొత్తం ఆ నేరస్థుడి ఫోటోను షేర్ చేసే పనికి పూనుకుంది.. మరి ప్రభుత్వం ఏమిచేస్తుంది? కేసీఆర్ & కో కు చీమ కుట్టినట్లైనా ఎందుకు లేదు?

అవును… సింగరేణిలో ఆరేళ్ల పసిగుడ్డు, కామాందుడి వికృతచేష్టలకు బలైపోతే స్పందించాల్సిన ప్రభుత్వం, ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. అంతకంటే ముందు ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన ప్రభుత్వం ఏమైపోయింది? స్పర్శ తెలియకుందా.. మతి భ్రమిచిందా? అనేస్థాయిలో స్పందించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి! ఈ సందర్భంగా అందరికీ అర్థమయ్యే రీతిలో కేసీఆర్ అండ్ కో లపై విమర్శల వర్షాలు కురిపించారు!

ఆరేళ్ల పసికందును ఓ రాక్షసుడు రేప్ చేసి హత్య చేయడం దారుణమని స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి… చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించకడానికి సీఎం కేసీఆర్, దత్తత తీసుకున్న కేటీఆర్, డమ్మీ హోం మంత్రి మహమూద్ అలీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాకపోవడం దారుణమని అన్నారు. నిజంగా కూడా వీరెవరూ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం దుర్మార్గమనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి!

ఇదే క్రమంలో… అధికారపక్షంపై మరిన్ని ప్రశ్నలు సందించారు కోమటిరెడ్డి! బతుకమ్మ అంటూ తెలంగాణ అంతా తిరిగే కవిత ఇక్కడికి ఎందుకు రాలేదు? మానవత్వం ఉంటే కేటీఆర్ ఇక్కడికి రావాలి. దళిత, గిరిజన బిడ్డలని కేటీఆర్ రాలేదా? చిన్నారి చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులు ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామనడం బాధాకరం. చదువుకున్న కలెక్టర్ మాట్లాడే మాటలా ఇవి? నిందుతుడ్ని పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటిస్తున్నారు.. పోలీసులున్నది గాడిదలు కాయడానికా? అని కోమటిరెడ్డి మండిపడ్డారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version