రూట్ మార్చిన కేటీఆర్…కే‌సి‌ఆర్‌ చేసింది అదేగా…

-

తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే మాటల యుద్ధం కంటే బూతుల యుద్ధం అనడం బెటర్ ఏమో. అంతలా నాయకులు బూతులు మాట్లాడుకుంటున్నారు. ఊహించని విధంగా పుంజుకున్న కాంగ్రెస్, బి‌జే‌పిలు ఓ రేంజ్‌లో కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. ముఖ్యంగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్‌లు మరీ దూకుడుగా కే‌సి‌ఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బి‌జే‌పి నేతలు సైతం తమదైన శైలిలో కే‌సి‌ఆర్‌ని దూషిస్తున్నారు.

ktr

అలా అని టి‌ఆర్‌ఎస్ నాయకులు ఏమి ఊరికే ఉండటం లేదు. వారు కూడా బూతులతో ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడుతున్నారు. అయితే ఈ బూతుల విమర్శలపై మంత్రి కేటీఆర్ సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. కొత్త రాష్ట్రం, అందరూ మనోళ్లేనని ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, ఇక కేసీఆర్‌ను ఒక్క మాట అన్నా ఊరుకొనేది లేదని, ఎవడైనా అడ్డం పొడుగు మాట్లాడితే ఒకటికి పది బదులివ్వాలని, ఇటుకకు రాయితో సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజలు రెండు సార్లు గెలిపించిన ముఖ్యమంత్రి, వయసులో పెద్దవాడు, ఉద్యమ నిర్మాణం చేసిన నాయకుడు అన్న సోయి లేకుండా నిన్న, మొన్న పుట్టిన చిల్లర గాళ్లు ఎగిరెగిరి పడుతున్నారంటూ కేటీఆర్ తనదైన శైలిలో ప్రతిపక్షాలపై ఫైర్ అవుతున్నారు.

అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కేటీఆర్ ఇంత మాట్లాడక ప్రతిపక్షాలు ఎందుకు ఖాళీగా ఉంటాయి. వారు కూడా కేటీఆర్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. అసలు బూతులు మాట్లాడటం మొదలుపెట్టిందే కేసీఆర్ అని కావాలంటే , ఆయన పాత వీడియోలు చూసుకోవచ్చని, అలాగే టి‌ఆర్ఎస్ నేతలు బూతుల పంచాంగం గురించి ప్రజలకు బాగా తెలుసని, కాబట్టి కేటీఆర్ గురివింద నీతులు చెబితే ఇక్కడ వినేవాళ్ళు ఎవరూ లేరంటూ ప్రతిపక్షాలు కౌంటర్లు ఇస్తున్నాయి. అసలు రాజకీయ పార్టీలన్నీ బూతులతోనే రాజకీయం చేస్తున్నాయని ప్రజలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version