మంత్రులు డమ్మీ అయ్యారు..తెలంగాణలో మహిళలకు భద్రతే లేదు – కొండా సురేఖ

-

మంత్రులు డమ్మీ అయ్యారు..తెలంగాణలో మహిళలకు భద్రతే లేదని ఫైర్‌ అయ్యారు కొండా సురేఖ. డీజీపీ కార్యాలయంలో డిజిపి తో మహిళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావ్, కొండా సురేఖ,తదితరులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ రేప్ కేసులో నిందితుల వెనుకాల, అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని.. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని ఆగ్రహించారు.

జూబ్లీహిల్స్ రేప్ కేసులో దర్యాప్తు సరిగా జరగడం లేదని.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. మహిళలపై ఆగాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని.. మహిళలపై జరుగుతున్న నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవరించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ లో చాలా పబ్స్ అక్రమంగా నడుస్తున్నాయి.. ప్రశ్నించ్చిన వలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బాలిక పై గ్యాంగ్ రేప్ జరిగితే రాష్ట్ర మహిళా మంత్రులు ఎక్కడ పోయారని..జాగృతి మహిళా అధ్యక్షురాలు కవిత.. బాలిక రేప్ కేసులో ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. బాలిక రేప్ పై మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version