హుజురాబాద్ లో పోటీకి నో చెప్పిన కొండా సురేఖ‌..!

-

కొండా సురేఖ హుజురాబాద్ లో పోటీకి నో చెప్పేసింది. ముందు నుండి కొండా సురేఖ హుజురాబాద్ లో పోటీకి దిగుతుందంటూ వార్తలు వ‌చ్చాయి. అయితే కొండా సురేఖ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కొన్ని డిమండ్ల‌ను హైక‌మాండ్ ముందు ఉంచింది. ఇక హైక‌మాండ్ వ‌చ్చే ఎన్నిక‌ల‌పై హామీ ఇవ్వ‌క‌పోవ‌డంతో సురేఖ పోటీకి దూరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్ హుజురాబాద్ అభ్య‌ర్థి కోసం మ‌ళ్లీ వేట మొద‌లు పెట్టింది.

konda surekha

ఇక అభ్య‌ర్థి కోసం పీసీసీ వేసిన క‌మిటీ నుండి మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, బ‌ట్టీ విక్ర‌మార్క అభ్య‌ర్థిని ఖరారు చేసే ప‌నిలో ఉన్నారు. గ‌తంలో అక్క‌డ పోటీ చేసిన‌టువంటి పొన్నం ప్ర‌భాక‌ర్ ను పిలిపించి మాట్లాడుతున్న‌ట్టు స‌మాచారం. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాల‌నే ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా హుజురాబాద్ ఎన్నికల కోసం పాతి కృష్ణారెడ్డి మరియు రవికృష్ణ అనే ఇద్ద‌రు నాయ‌కుల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version