వైయస్సార్టీపీ అధినాయకురాలు వైయస్ షర్మిల తన దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రతీ మంగళవారం నిరుద్యోగుల పక్షాన దీక్ష చేస్తున్న షర్మిల, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా జిల్లాకు వెళ్తున్న షర్మిల, తాజాగా ఈరోజు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామానికి షర్మిల వెళ్ళనున్నారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల మరణించిన బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.
ఆ తర్వాత జుక్కల్ లో ఏర్పాటు చేసిన దళిత భేరి సభకు హాజరు కానున్నారు. ఉదయం 11గంటలకు షర్మిల షెట్లూర్ చేరుకోనున్నారు. ఇదిలా ఉంటే వైయస్ షర్మిల, వైయస్ విజయమ్మలకు కోర్టులో భారీ ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును కోర్టు కొట్టివేసింది. 2012లో పరకాల నియోజకవర్గంలో కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. ప్రస్తుతం దీన్నుండి షర్మిలకు ఊరట లభించింది.