బీజేపీలోకి మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ?

-

మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎంపీ గా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఆయన ఇప్పుడు మళ్ళీ పార్టీ మారేందుకు చూస్తున్నారు అని గట్టిగా ప్రచారం జరుగుతోంది ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది ఈ క్రమంలో ఆయన ఈ విషయమై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నేను బీజేపీ లోకి వెళ్తున్నా అని 2016 నుండి వెయ్యి సార్లు ప్రచారం జరిగిందని రూలింగ్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాడిని ఇప్పుడు మరో రూలింగ్ పార్టీలోకి వెళ్లనని అన్నారు. గ్రాఫ్ పడిపోయింది అని టీఆర్ఎస్ తొందరగా ఎన్నికలు పెట్టుకుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ గ్రాఫ్ ఇంత తొందరగా పడిపోతుంది అని అనుకోలేదన్నారు ఆయన. ఇక బీజేపీ లోకి..భిక్షపతి యాదవ్  వెళ్ళారని దీనికే కాంగ్రెస్ ఖతం అయ్యిందని బీజేపీ అంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఖతం అయ్యేది ఉండదన్న ఆయన భిక్షపతి యాదవ్ బీజేపీ లోకి వెళ్లడం తో టీఆర్ఎస్ కి లాభమని అన్నారు. ఆయన అసలు ఆలోచన చేయకుండా పార్టీ మారిపోయారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version