కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. టిడిపి పార్టీ నేతలు దాఖలుచేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొండపల్లి మున్సిపల్ కమిషనర్, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ పై కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 2:15 గంటలకు హాజరు కావాలని స్పష్టంచేసింది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు. తాము చెప్పిన సమయానికి రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది హై కోర్ట్. ఇది ఇలా ఉండగా ఈ ఎన్నిక పై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ కుమార్… సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదని .. ఎన్నికల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. కోర్టు నిర్ణయం మేరకు తాము కూడా ముందుకు వెళ్తామని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. కాగా ఇవాళ కూడా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే.