వావ్.. కోనేరు హంపి సంచలనం

-

ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ సంచలనం సృష్టించింది. మొదటి రోజు 9 రౌండ్లు ముగిశాక రెండు ఓటములు, 5 పాయింట్లతో 44వ స్థానంలో ఉన్న ఆమె.. 17 రౌండ్లు ముగిసే సరికి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రెండో రోజు 8 గేమ్స్ జరగ్గా, ఏడింటిలో గెలిచింది. దీంతో రజత పతకం సొంతం చేసుకుంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ పతకం సాధించిన భారత ప్లేయర్ హంపినే కావడం విశేషం.

ఇక్కడ జరుగుతున్న ఫిడే ప్రపంచ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి తృటిలో స్వర్ణపతకాన్ని చేజార్చుకుంది. ఇక భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 14రౌండ్‌లు ముగిసేసరికి 7విజయాలను నమోదు చేసుకొని పతకం సాధించడంలో విఫలమైంది. స్వర్ణ పతకం బిబిసరా అసుభయేవా(కజకిస్తాన్‌)కు లభించగా.. పోలినా షువలోవా(రష్యాాఫిడే)కు లభించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version