సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు షాకిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ అలయన్స్ పెట్టుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సీపీఐ కట్టుబడి ఉండాలి. కానీ, రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, జనావాసాల్లో ఫార్మా సిటీని పెట్టేందుకు తాము ఒప్పుకోమని కూనంనేని ప్రకటించారు.
మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈ ప్రకటన చేశారు. జనావళి ప్రాంతాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.లగచర్ల దాడి ఘటన దురదృష్టకరమన్నారు. కలెక్టర్, అధికారులపైన దాడి చేయడం సరైంది కాదన్నారు. తరచూ రాష్ట్రంలో ఏదో మూల ఘర్షణలు జరుగుతున్నాయని, దీనికి అసలు కారకులు ఎవరనే దానిపై ప్రభుత్వం సీరియస్‌గా విచారణ జరిపించాలన్నారు.