కొరటాల శివ బ్లాక్ బస్టర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. వస్తూనే తుఫాన్ లా టాలీవుడ్ పై విరుచుకుపడ్డాడు. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు. మిర్చి మినహా తక్కిన మూడు సినిమాలు 150 కోట్లకు పైగా వసూల్లు తెచ్చినవే. అందుకే కొరటాల టాప్ డైరెక్టర్లలలో టాప్ పోజిషన్ లో ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటుగా వచ్చినా లెటెస్ట్ కంటెట్లతో సినిమాలు చేయడం కొరటాల స్టైల్. అది నచ్చే మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ సరికొత్త కంటెంట్ తో మెగాస్టార్ ను తెరపై చూపించ నున్నాడు. మెగాస్టార్ తో ఏ పాయింట్ తో వస్తున్నాడు అన్నది రిలీజ్ వరకూ ఓ మిస్టరీగా కొనసాగుతుంది.
రిలీజ్ తర్వాత అది సంచలనమే అవుతోంది అన్న కాన్ఫిడెన్స్ చాలా మందిలో ఉంది. అయితే చిరు కోసం కొరటాల ఏడాదికిపైగా వెయిట్ చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి అనుకున్న టైమ్ లో షూటింగ్ పూర్తికాకపోవడంతో కొరటాలకు వెయిటింగ్ తప్పలేదు. జులై లేదా అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లుందని అంటున్నారు. కానీ ఇంకా దానిపైనా క్లారిటీ లేదు. అయితే కొరటాల ఏడాది వెయిట్ చేయడం కొంత మందికి నచ్చలేదు. దీంతో ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. చిరు కోసం ఏడాది వెయిట్ చేసి టైమ్ వేస్ట్ చేసుకున్నారు. ఈ గ్యాప్ లో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నా చేయలేదు. అందువల్ల కొరటాలకే కోట్లలో నష్టం అంటూ కొన్ని పోస్టింగ్ లు పెట్టారు. వాటికి కొరటాల రిప్లై ఇవ్వలేదనుకోండి.
అయితే ఆయన అభిమానులు మాత్రం ఘాటుగానే స్పందించారు. కంగారు పడకండి. ఏడాది గ్యాప్ ను వడ్డీతో సహా తెస్తాడు. మెగాస్టార్ తో అంతటి బ్లాక్ బస్టర్ కొడతాడంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తారక్, మహేష్ లాంటి హీరోలకే 150 కోట్ల వసూళ్లు తెచ్చే సినిమా అందించాడు. అలాఒంటింది పదేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీతో వచ్చే చిరు 150 కోట్లు తెచ్చాడు. అంతటి దిగ్గజానికి కొరటాల తోడైతే బాక్స్ బద్దలైపోదా అంటూ రిప్లై ఇచ్చారు. చూద్దాం కొరటాల అభిమానుల నమ్మకం ఎంత వరకూ నిలబడుతుందో.