మెగా నిర్మాత అల్లు అరవింద్ రామాయణం తెరకెక్కిస్తున్నట్లు సరిగ్గా ఏడాది క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ భాసల్లో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు వెల్లడించారు. బాలీవుడ్ దర్శకుడు దీన్ని టేకప్ చేయబోతున్నట్లు ..అరవింద్ తో మరో ఇద్దరు బడా నిర్మాతలు చేతులు కలుపుతున్నట్లు వినిపించింది. అయితే తర్వాత దీనిపై ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంటుందని భావించారు. కానీ తాజాగా నేడు అరవింద్ రామాయణం అప్ డేట్స్ అధికారికంగా ఇచ్చారు. ఇది మూడు భాగాలు గా మూడు భాషల్లో తెరకెక్కుతుందని హింట్ ఇచ్చారు. అత్యాధునిక త్రీడీ టెక్నాలజీతో దీన్ని రూపొందించనున్నారుట.
దీనికి దంగల్ దర్శకుడు నితీష్ తివారితో పాటు, మామ్ దర్శకుడు రవి ఉద్యావర్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారుట. మధువంతెన, నమిత్ మల్హోఆత్రా సహ నిర్మాతలుగా వ్యవవహరించనున్నారుట. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2021లో మొదటి భాగాన్ని అన్ని పనులు పూర్తిచేసి రిలీజ్ చేయనున్నారుట. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ నుంచి మరో ఆసక్తికర లిక్ అందుందింది. మూడు భాషల్లో చేస్తున్నారు కాబ్టటి మూడు భాషల స్టార్లను కథకు అనుగుణంగా తీసుకునే అవకాశాలు న్నాయంటున్నారు. మెగా కాంపౌండ్ లో నే నలుగురు, ఐదుగురు హీరోలున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్ రాణిస్తున్నారు. ఇండియా సహా విదేశాల్లో మార్కెట్ ఉన్న స్టార్లు అయితే ఓ ముగ్గరు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్లలో ఎవరో ఒకరు కచ్చితంగా నటించే అవకాశం ఉంది. ఇక తమిళ్ నుంచి ఎవర్ని తీసుకుంటారు? బాలీవుడ్ లో ఆ చాన్స్ ఎవర్ని వరిస్తుంది? అన్నది తేలాల్సి ఉంది. నితీష్ -రవి ఉద్యవార్ వంటి ఇద్దరు దిగ్గజాలు తెరకెక్కించే సినిమా కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు బజ్ క్రియేట్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.