లాక్ డౌన్ లో ఇప్పుడు టాలీవుడ్ జనాలు ఎక్కువగా బీ ది రియల్ మెన్ అనే హ్యాష్ ట్యాగ్ ని ఎక్కువగా వాడుతున్నారు. తమ ఇంట్లో పని చేస్తున్న వీడియో లను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తూ వస్తున్నారు. ఇంట్లో మహిళలకు సహకరించాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ కి ఇప్పుడు మంచి స్పందన వస్తుంది. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పందించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఈ చాలెంజ్ ని కొరటాల శివ కు చేయగా ఆయన దీనిపై స్పందించారు. ఛాలెంజ్లో పాల్గొన్న తారక్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, కొరటాల శివను బీ ద రియల్మేన్ ఛాలెంజ్లో పాల్గొనాలని కోరగా… దీనికి ముందుగా స్పందించిన కొరటాల శివ థాంక్స్ ‘‘ఛాలెంజ్ అంగీకరిస్తున్నా తారక్ అన్నయ్యా!.. ఇప్పటికే నెలరోజుల ఫుటేజ్ మిస్సయ్యింది’’ అని ట్వీట్ చేసారు.
ఇక రామ్ చరణ్ బాలీవుడ్ హీరోలకు కూడా ట్యాగ్ చేసాడు. తన చిన్న నాటి స్నేహితుడు రానాను కూడా ట్యాగ్ చేసాడు. శర్వానంద్ రణవీర్ సింగ్ ని నామినేట్ చేసాడు. వీళ్ళు అందరూ కూడా దీనికి స్పందించి ట్వీట్ చేస్తే అది బాలీవుడ్ లో కూడా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఎలా ఉన్నా మహిళల కష్టాన్ని పంచుకోవాలి అనుకోవడం నిజంగా అభినందించే విషయం.
Challenge accepted @tarak9999 annayya. Nela rojula footage miss ayindi already https://t.co/bifrA4iLOO
— koratala siva (@sivakoratala) April 21, 2020