వెయ్యి కోట్లు కోల్పోయిన తెలుగు రాష్ట్రాలు .. ఇప్పుడెలా ?

-

పన్నుల వాటాలను ఆయా రాష్టాలకు బదిలీ చేస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందటే డిజాస్టర్ రెస్పాన్స్ మిటిగేషన్ ఫండ్ రూపంలో రూ. 17 వేళా కోట్లు రాష్ట్రాల ఆదాయ శాఖకు బదిలీ చేసింది. అయితే కరోనా కారణంగా రాష్టాలకు ఆదాయం తగ్గిన తరుణంలో ఈ వాటాలు కేంద్రం నుండి వచ్చేయడం మంచిదే. కానీ పన్నుల్లోనే తెలుగు రాష్ట్రాలకు దాదాపు రూ. వేయి కోట్లు గండి పడింది. గడిచిన 40 రోజులుగా కేంద్రానికి ఆదాయం లేదు. పన్నులు, వివిధ రూపాల్లో కేంద్రానికి రూ. లక్షన్నర కోట్లు తగ్గింది. అందుకే రాష్ట్రాల వాటాలు కూడా తగ్గించి ఇచ్చింది. 29 శాతానికి పైగా రాష్ట్ర వాటాలకు గండి పడింది. మన రాష్ట్రాల లెక్కల ప్రకారం తెలంగాణకు రూ. 1195 కోట్లు రావాల్సి ఉంది. కానీ రూ. 982 కోట్లు మాత్రమే వచ్చాయి. ఏపీకి రూ. 2686 రావాల్సి ఉండగా, రూ. 1892 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రెండు తెలుగు రాష్టాలు దాదాపు రూ. వేయి కోట్లు కోల్పోయాయి.కరొనా వల్ల ఏర్పడ్డ లోక్డౌన్ వల్ల దాదాపు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెల్సి కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాన్ని ఇచ్చే సంస్థలను కూడా ప్రభుత్వం మూసివేయడాన్ని అభినందించాలి. 1929 లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ తరువాత 2008 లో వచ్చిన ఆర్థిక మాంద్యం కన్నా ఇప్పుడు ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం చాలా దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుందని ఐఎంఎఫ్ సంస్థ వెల్లడించింది. అయితే 2008 లో ఎకనామిక్ రెస్సెషన్ వచ్చినప్పుడుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొలకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెప్పారు.

కానీ నిపుణులు ఊహించిన దానికంటే ముందే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం సమయం జపాన్ తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, ఆర్థిక నిపుణులు ఆదేశం కొలకోవడానికి 100 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా కేవలం 5-6 ఇయర్స్ లో పుంజుకుంది. అలాగే ఇప్పుడు ఏర్పడ్డ రెస్సెషన్ ని కూడా ప్రపంచ దేశాలు దైర్యంగా ఎదుర్కొంటుందని ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version