కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మద్యం షాపులను తెరిచే పరిస్థితి లేదు. మద్యం షాపులను ఓపెన్ చేసినా సరే ఒకరి మీద ఒకరు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు కరోనాకు పూల దండలు వేసి స్వాగతం పలికినట్లు ఉంటుంది. అందుకే ఇప్పుడు కరోనా సోకకుండా ఉండటానికి మద్యం షాపులను తెరవడం లేదు.
ఈ తరుణంలో మహారాష్ట్ర మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు కనుక భౌతిక దూరాన్ని పాటించినట్లయితే మద్యం దుకాణాలను మూసేయాల్సిన అవసరం ఏముంది? అని ఆయన ప్రశ్నించారు. కరోనాను కట్టడీ చేయాలంటే కాస్త కఠినంగానే వ్యవహరించాలి. మద్యంపై నిషేధం అందులో భాగమే అని ఆయన పేర్కొన్నారు. ఒక పక్క మద్యం కోసం జనాలకు పిచ్చి ఎక్కే పరిస్థితి నెలకొంది.
చాలా మంది మద్యానికి దూరంగా ఉండలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా నెలకొంది. మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో దాదాపు 4 వేలకు పైగా కరోనా కేసులు ఉన్నాయి. అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తుంది అక్కడ. మద్యం షాపులను తెరిస్తే మాత్రం అక్కడ పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంటుంది. మరణాలు కూడా ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి.