తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది : కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

-

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మరోసారి తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తానని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. ఆదాల ఏ పార్టీతో ఉండబోతున్నారో, ఏ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ బీఫామ్ ను జేబులో పెట్టుకుని జగన్ ను కలిసిన ఘనత ఆదాలదని… అలాంటి వ్యక్తా తన గురించి మాట్లాడేది అని ఎద్దేవా చేశారు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

టీడీపీ బీఫామ్ ను జేబులో పెట్టుకుని చంద్రబాబును కలవడానికి వెళ్తున్నానని చెప్పి, అక్కడి నుంచి నేరుగా జగన్ వద్దకు వెళ్లారని విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పులివెందుల రౌడీ జగన్, నెల్లూరు రౌడీ కోటంరెడ్డి అని గతంలో ఆదాల చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయని చెప్పారు. ఇలాంటి వ్యక్తి వైసీపీలోనే కొనసాగుతారనే నమ్మకం తనకు లేనట్టుగా కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఒకే పార్టీలో ఉండాలని… గతంలో మాదిరి అన్ని పార్టీలు తిరగొద్దని ఎద్దేవా చేశారు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. ఆదాలకు వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చని… తనకు అంతకంటే విలువైన నియోజకవర్గ ప్రజల అభిమానం ఉందని చెప్పారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని… కేవలం రాజకీయ పోటీదారుడిగానే చూస్తానని అన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version