BREAKING : 16వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య..!

-

టర్కీ, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం దాటికి రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. భవనాల శిథిలాల నుంచి గంటగంటకూ వందల శవాలు బయటపడుతున్నాయి. పలువురు రాళ్లు, రప్పల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 16,000వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.

మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని 24 దేశాలకు చెందిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. తుర్కియేలో భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు శిథిలాల కింద వేల మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version