తగ్గని కోటంరెడ్డి..నెల్లూరు రూరల్‌లో వైసీపీకి పట్టు తప్పుతుందా?

-

ఊహించని విధంగా జగన్‌కు వీర విధేయుడుగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..వైసీపీకి దూరం కావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వరుసపెట్టి అధికార వైసీపీపై అసంతృప్తి గళం విప్పుతూ..ఫైర్ అవుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి మొదట నుంచి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. ఇక ఆయనకు వైసీపీకి చెక్ పెడుతూ..వెంకటగిరి స్థానానికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టిన విషయం తెలిసిందే.

ఇక ఆనం బాటలోనే కోటంరెడ్డి రివర్స్ గేర్ వేశారు..తన ఫోన్‌ని సొంత పార్టీనే ట్యాప్ చేస్తుందని, నమ్మకం లేని చోట ఉండలేనని, వైసీపీ నుంచి బయటకొచ్చారు. అలాగే ఈయన టి‌డి‌పిలోకి వెళ్లడానికి రెడీ అయ్యారు. అయితే కోటంరెడ్డికి అధికార వైసీపీ తమ బలాన్ని చూపిస్తుంది..ఇప్పటికే సెక్యూరిటీని తగ్గించింది..అలాగే నెల్లూరు రూరల్‌కు ఇంచార్జ్ గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ఇక కోటంరెడ్డి సైతం వైసీపీ పై ఫైర్ అవుతూ వస్తున్నారు. ఉన్న సెక్యూరిటీని కూడా వెనక్కి పంపేశారు. తనకు ప్రజలే రక్షణ అని అంటున్నారు. అలాగే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను ఎవరికి భయపడే రకాన్ని కాదని అంటున్నారు.

ఇక కోటంరెడ్డి నెల్లూరు రూరల్‌లో తన మద్ధతు పెంచుకుంటున్నారు. ఇప్పటికే మేయర్ స్రవంతి కోటంరెడ్డి వెనుక నడుస్తామని చెప్పారు. అటు కొందరు కీలక నేతలు కోటంరెడ్డి వైపే ఉన్నారు. అయితే ఇంతకాలం రూరల్‌లో వైసీపీ హవా నడుస్తూ వచ్చింది. మరి ఇప్పుడు కోటంరెడ్డి దూరం కావడంతో రూరల్ లో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతాయా? అనే డౌట్ కూడా వస్తుంది. ఒకవేళ ఆయన టి‌డి‌పిలోకి వెళితే సీటు దక్కుతుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే కోటంరెడ్డి వైసీపీకి దూరం కావడం నెల్లూరు రూరల్‌లో కాస్త ఇబ్బందే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version