నేను చేసిన పెద్ద తప్పు అదే.. కృష్ణవంశీ ఎమోషనల్..!

-

కృష్ణవంశీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కృష్ణవంశీ మనందరికీ సుపరిచితమే. పలు బ్లాక్ బాస్టర్ హిట్స్ ని అందించి పాపులర్ అయిపోయారు. టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన శ్రీ ఆంజనేయం సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే అయితే ఇటీవల ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ నేపథ్యంలో దీనికంటే శ్రీ ఆంజనేయం బాగుందని నెట్టింట పలు పోస్టులు వైరల్ అయ్యాయి కృష్ణవంశీ కూడా స్పందించి సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ పెట్టారు.

తాజాగా మరో పోస్ట్ కి కృష్ణవంశీ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. శ్రీ ఆంజనేయం సినిమా అంతా వేరే లెవెల్ లో ఉంది కాన్సెప్ట్ పరంగా మూవీ అందరిని ఆకట్టుకుంది కానీ ఇందులో నితిన్ చార్మి మధ్య రొమాంటిక్ సాంగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు అని పోస్ట్ చేశారు. దానికి కృష్ణవంశీ సమాధానం ఇస్తూ అసలు ఆ పాట పెట్టడానికి కారణం నేను. అదే నేను చేసిన పెద్ద తప్పుగా భావిస్తాను ఇప్పటికీ బాధపడుతున్నాను క్షమించండి అని ఈ పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version