బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీరు పై విరుచుకు పడ్డారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులపై ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ, కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా, ట్విట్టర్ లో ఆ ట్వీట్ పై స్పందించారు మంత్రి కేటీఆర్ . రహదారుల అభివృద్ధి విషయంలో మోదీ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనంటూ ఆయన ట్వీట్ చేపట్టారు . కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణలో కొనసాగుతున్న రహదారుల అభివృద్ధిపై తన ట్వీట్‌లో తెలిపారు మంత్రి కేటీఆర్.
ఉప్పల్, అంబర్‌పేట ఫ్లై ఓవర్ల పనులు దురదృష్టావశాత్తు నేషనల్ హైవేస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ రెండు ఫ్లై ఓవర్లకు జీహెచ్ఎంసీ భూములు కేటాయించినప్పటికీ పనులు మాత్రం చాల మెల్లిగా జరుగుతున్నాయని అన్నారు మంత్రి కేటీఆర్. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీ ద్వారా ఎస్ఆర్డీపీ కింద 35 ప్రాజెక్టులు చేపట్టి.. అనతి కాలంలోనే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు ఆయన. కానీ కేంద్రం చేపట్టిన రెండు పనులు మాత్రం పూర్తి కావడం లేదని తన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని కేటీఆర్ అన్నారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ ఎప్పుడు పూర్తవుతుంది సర్.. పనులు చాలా మెల్లగా జరుగుతున్నాయి. నారపల్లి నుంచి సిటీలోకి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెటిజన్.. కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.