లైఫ్ సెన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్: కేటీఆర్

-

లైఫ్ సెన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్ నిలిచిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం స్విట్జర్లాండ్ దావోస్ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో జరిగిన లైఫ్ సెన్సెస్ అభివృద్ధిపై ఆయన చర్చించారు. ఆయనతోపాటు డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి జీవీ ప్రసాద్ రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహ్మద్ అథర్ ఉన్నారు.

మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, మెడికల్‌కు ప్రాధాన్యత పెరిగిందన్నారు. మెడికల్ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. ప్రపంచ పోటీకి తట్టుకోవాలంటే.. విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమన్నారు. లైఫ్ సైన్సెస్‌లో హైదరాబాద్ టాప్‌లో ఉందన్నారు. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు లేదన్నారు. ఐటీ, ఫార్మారంగం కలిసి పని చేసినప్పుడే అభివృద్ధి మరింత సాధ్యమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version