వైసీపీ మంత్రులు ఇప్పుడు ఏమంటారు : శైలజానాథ్‌

-

ఎమ్మెల్సీ ఆనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రమణ్యం మృతి ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. సుబ్రమణ్యం భార్య, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగితే.. కలెక్టర్‌, ఆర్డీవో రంగంలోకి దిగి వారికి నష్టపరిహారంగా డబ్బుతో సహా ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేస్తామని హామీ ఇచ్చిన తరువాత శాంతించారు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు. అయితే తాజాగా నేడు ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా… అనంతబాబు సుబ్రమణ్యంను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దళితులకు రక్షణ ఇదేనా? అని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు.

మూడేళ్లలో దళితులకు జగన్ రెడ్డి చేసిన మేలు ఏంటో చెప్పే దమ్ము, ధైర్మం ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు ఇప్పుడు ఏమంటారు? అని ఆయన ప్రశ్నించారు. దళిత ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కొమ్ముకాయడం మాని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే నిర్భీతిగా హత్యలు చేస్తుంటే దళిత మంత్రులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నా వైసీపీ మంత్రులు ఇంకా కట్టు కథలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version