కేవలం మీడియాల్లో కనబడటం కోసమే బండి సంజయ్ లేఖలంటూ ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం బండి సంజయ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖపై ఆయన స్పందించారు. తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎంకు రాసిన లేఖ ఓ అబద్ధాపు జాతరలా ఉందంటూ విమర్నించారు. భాగ్యనగరానికి ఐటీఐఆర్ ( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) తీసుకురాలేని బీజేపీ, రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఐటీఐఆర్ ఆగిపోవడానికి కేవలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వామేనని ఆయన మండిపడ్డారు.
పార్లమెంట్ సాక్షిగా ప్రకటన..
దేశంలో ఐటీఐఆర్ విషయంలో బీజేపీనే వెనక్కితగ్గిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఆ ప్రకటన గురించి బండి సంజయ్‌కు తెలియకపోవడం ఆయన ఆజ్ఞానానికే నిదర్శమన్నారు. బండి సంజయ్‌కు దమ్ముంటే.. 2014 నుంచి రాసిన లేఖలు, డీపీఆర్‌లను ఆయనకు ఇస్తాం.. కేంద్రం నుంచి ప్రకటన ఇప్పిస్తాడా అని ప్రశ్నించారు.
ధరల పెంపునకు బాధ్యులెవరు..
దేశంలో రోజురోజకు పెరుగుతున్న ధరలకు బాధ్యత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వహిస్తారా అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. యూïపీ హయాంలో ధరలు పెగినప్పుడు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, మోదీ నాటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను ట్విటర్‌కు జతచేశారు. కేవలం ప్రగల్భాలు పలికితే సరిపోదాని.. పనులు చేసిన తర్వాతే మాట్లాడాలని కేటీఆర్ బీజేపీ నాయకులకు చురకలంటించారు.