మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. డబ్బులు ఇచ్చిన వారికే కాంగ్రెస్ టికెట్లు దక్కుతున్నాయి. కూకట్‌పల్లి సీటు కోసం రూ. 15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు. నేను చెప్పినట్టే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోంది. ఇప్పటికే రూ. 8 కోట్లు కొడంగల్ చేరినట్టు సమాచారం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీని వారి నాయకత్వమే సీరియస్‌గా తీసుకోవడం లేదు. బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుంది. బీజేపీతో స్నేహముంటే మోదీని ఎందుకు తిడుతాం. మేం ప్రతీకార రాజకీయాలు చేయడం లేదు. రేవంత్ అక్రమాలపై ఐటీ, ఈడీ సోదాలు ఎందుకు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు బహిరంగంగా అమ్ముకుంటోందని కేటీఆర్ అన్నారు. కూకట్ పల్లి అసెంబ్లీ సీటుకు రూ.15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత తనకు చెప్పారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 40 స్థానాల్లో అభ్యర్థులే లేని కాంగ్రెస్.. 70 సీట్లలో గెలుస్తామని ఎలా చెబుతారని సెటైర్ వేశాడు. డబ్బులున్న వారికే కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లీడర్ కాదని.. ఆయనో రీడర్ అని ఎద్దేవా చేశారు.