నారా లోకేష్ ట్వీట్ పై కేటీఆర్ స్పందన…!

-

https://x.com/naralokesh/status/1712715891392348522?s=20

ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ నేత నారా లోకేష్ చేసిన ట్వీట్ గురించి సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ ట్వీట్ ప్రకారం జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నాడని తెలియచేసే ప్రయత్నం చేశాడు. చంద్రబాబుకు అలర్జీ, బరువు తగ్గడం, దోమలు, కలుషితమైన నీరు వంటి కారణాలు చూపి ప్రాణభయం ఉందని లోకేష్ ట్వీట్ చేశాడు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే ఇందుకు పూర్తి బాధ్యత సీఎం జగన్ దే అంటూ మెన్షన్ చేశాడు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించడం విశేషం.. నారా లోకేష్ చెప్పినట్లుగా చాలా బాధగా ఉంది. ఇది నిజం అని నమ్మితే చాలా దురదృష్టం అని అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉపవాస దీక్ష గుర్తుకు వస్తోందని చెప్పారు.

ఆ రోజు కేసీఆర్ మరొక్క రోజు కనుక దీక్షను కొనసాగిస్తే ప్రాణం పోతుందని చెప్పారని ఆ నటి విషయాలు గుర్తు చేసుకున్నారు కేటీఆర్. ఈ విషయం పూర్తిగా రెండు పార్టీల మధ్య జరుగుతోందని వల్లే తేల్చుకోవాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version