బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక సదస్సు రావాలని ఆహ్వానం అందింది.బ్రిటన్‌లో జరిగే ‘ఐడియాస్ ఫర్ ఇండియా-2025’కు రావాలంటూ బ్రిడ్జి ఇండియా సంస్థ ప్రత్యేకంగా ఆహ్వానించింది. మే 30న లండన్‌లోని రాయల్ లాంకాస్టర్ హోటల్లో జరిగే సదస్సుకు కేటీఆర్‌ను ముఖ్య వక్తగా పిలుస్తూ బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తానీ తాజాగా ఆయనకు ఆహ్వాన లేఖను పంపారు.
గత 2023లో ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఇచ్చిన ప్రసంగం ఆకట్టుకుందని ప్రతీక్ వెల్లడించారు.ఈసారి కూడా లండన్ వ్యాపార వర్గాలు, ఇండో-యూకే కారిడార్లోని ముఖ్య వ్యక్తులు, తెలుగు ప్రవాసులు కేటీఆర్‌ను కలవడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తున్నారని లేఖలో వివరించారు.